గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2026లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. పదో రోజు బాక్సింగ్‌లో భారత బాక్సర్లు స్వర్ణ పతకాల వర్షం కురిపించారు. ప్రీతి పవార్, జైస్మిన్ లాంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఘంగాస్, అరుంధతి చౌదరి తమ తమ విభాగాల్లో బంగారు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించారు. ఇంకా మూడు ఫైనల్స్‌లో భారత్‌కు మరో మూడు స్వర్ణాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అథ్లెటిక్స్‌లో పురుషుల ఎఫ్57 షాట్‌పుట్‌లో సోమన్ రాణా స్వర్ణం సాధించగా, శుభమ్ జుయాల్ రజత పతకం అందుకున్నాడు. ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రవేల్ రజతం, సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్యం గెలిచారు. జూడోలో ఉన్నతి శర్మ కూడా కాంస్య పతకాన్ని ఖాతాలో వేసింది.
#CommonwealthGames2026 #CWG2026 #IndiaBoxing #IndianBoxers #Boxing #Glasgow2026 #PreetiPawar #JaismineLamboria #SakshiChoudhary #PriyaGhanghas #ArundhatiChoudhary #GoldMedal #IndiaGold #TeamIndia #IndianSports #CommonwealthGames #SportsNews #BoxingChampions











