Home Sports_News బీహార్ నుంచి మరో టీనేజీ క్రికెట్ సంచలనం

బీహార్ నుంచి మరో టీనేజీ క్రికెట్ సంచలనం

49

అండర్-19 వన్డే మ్యాచ్‌లో అక్షర గుప్తా త్రిబుల్ సెంచరీ

బీహార్‌కు చెందిన 13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకుని, జాతీయ టీ20 జట్టులో చోటు సంపాదించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే రాష్ట్రం నుండి మరో అద్భుతమైన టీనేజీ క్రికెట్ సంచలనం వెలుగులోకి వచ్చింది. బీహార్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన మహిళల అండర్-19 వన్డే ట్రోఫీ టోర్నమెంట్‌లో అక్షర గుప్తా అనే 15 ఏళ్ల అమ్మాయి కేవలం 126 బంతుల్లోనే 242.86 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 306 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

ఫోర్లు సిక్సర్ల వర్షంతో సరికొత్త రికార్డులు
తూర్పు చంపారన్ జిల్లా రక్సాల్ పట్టణానికి చెందిన అక్షర గుప్తా తన ఇన్నింగ్స్‌లో మొత్తం 55 ఫోర్లు, 8 సిక్సర్లు బాది సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ఆమె కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ, 34 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 14 ఏళ్ల వయసులోనే అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అక్షర, బీహార్ తరఫున రెండేళ్ల వ్యవధిలో వరుసగా నాలుగు బీసీసీఐ టోర్నమెంట్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది.