Home Sports_News సూర్యవంశీకి బీసీసీఐ బంపర్ ఆఫర్ – తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు ఛాన్స్

సూర్యవంశీకి బీసీసీఐ బంపర్ ఆఫర్ – తల్లిదండ్రులతో కలిసి ఇంగ్లండ్‌కు ఛాన్స్

47

భారత క్రికెట్ నయా సంచలనం, చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన ఈ యువ బ్యాటర్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. వారి ప్రయాణ, వసతి ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధ్రువీకరించారు. కేవలం 15 ఏళ్ల చిన్న వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన వైభవ్ కొత్త వాతావరణానికి అలవాటుపడేందుకు తల్లిదండ్రుల సాన్నిహిత్యం ఎంతో అవసరమని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో సచిన్ టెండూల్కర్ మాత్రమే ఇంత చిన్న వయసులో భారత జట్టులోకి వచ్చాడని, ఇప్పుడు వైభవ్ కూడా అలాంటి ప్రత్యేక ప్రతిభ కలిగిన ఆటగాడని సైకియా కొనియాడారు. ఐపీఎల్ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వైభవ్ సూర్యవంశీ.. ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే 237 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డులను కైవసం చేసుకున్నాడు. ఈ అసాధారణ ఆటతీరుతోనే అతనికి భారత టీ20 జట్టులో చోటు లభించింది. ప్రస్తుతం అతను శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్నాడు.