Home Telangana పవన్ కళ్యాణ్‌పై కేసు ఎందుకు పెట్టలేదు? టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత ఫైర్

పవన్ కళ్యాణ్‌పై కేసు ఎందుకు పెట్టలేదు? టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత ఫైర్

33

ప్రాంతీయవాదాన్ని వేర్పాటువాదంతో పోల్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. కరీంనగర్‌లో జరిగిన పార్టీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ భావజాలంపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇదే సమయంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ సిరిసిల్లాకు కేవలం వీకెండ్‌లో వచ్చి వెళ్లే ఒక విజిటింగ్ టూరిస్ట్ అంటూ కవిత ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తున్నా, సిరిసిల్లలో ‘సెస్’ వ్యవస్థ ఆగమాగమవుతున్నా కేటీఆర్ ఎందుకు నోరెత్తడం లేదని కవిత నిలదీశారు. గతంలో నేరెళ్లలో అక్రమ ఇసుక సంపాదన కోసం దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినా బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. నేరెళ్ల బాధితుల ఓట్లతో గెలిచి కార్పొరేటర్ నుండి కేంద్రమంత్రి అయిన బండి సంజయ్ కుమార్.. ఇప్పుడు వారి తరఫున మాట్లాడకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నారని కవిత తీవ్రంగా ప్రశ్నించారు.