జగన్ అల్టిమేటం వల్లే కదలికన్న వైసీపీ.
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రభుత్వం స్పందించి కరువు మండలాల ప్రకటనకు తేదీ ఖరారు చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తమ పోరాట ఫలితంగా ప్రచారం చేస్తోంది. ఈ నెల 17న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలతో నిర్వహించిన సమీక్షలో రైతుల సమస్యలు, సాగునీటి కొరత, వర్షపాతం లోటుపై ప్రభుత్వాన్ని నిలదీశారు. కరువు మండలాలను వెంటనే ప్రకటించాలని, లేకపోతే ఉద్యమిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఆ మరుసటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి అక్టోబర్ 1న కరువు మండలాలను ప్రకటించనున్నట్లు వెల్లడించడంతో.. ఇది జగన్ ఒత్తిడి ఫలితమేనని వైసీపీ నేతలు చెబుతున్నారు. విశాఖ నీటి కొరతపై నా వైసీపీ విమర్శలు గుప్పించింది. విశాఖలో నీటి సమస్య లేదని కూటమి నేతలు ఎలా చెప్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటనలో లెఫ్ట్ కెనాల్ ద్వారా వచ్చే ఏడాది నుంచి నీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని ప్రకటించడమంటే ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
#APDrought #YSRCP #YSJagan #JaganMohanReddy #DroughtDeclaration #DroughtMandals #ChandrababuNaidu #APFarmers #WaterCrisis #Visakhapatnam #VizagWaterCrisis #Polavaram #RainfallDeficit #AndhraPradeshPolitics #APPolitics











