Home AP పులివెందులలో జగన్‌.. ఆనంద్‌రెడ్డికి నివాళి.. కుటుంబానికి పరామర్శ

పులివెందులలో జగన్‌.. ఆనంద్‌రెడ్డికి నివాళి.. కుటుంబానికి పరామర్శ

Former Chief Minister YS Jagan Mohan Reddy attended the funeral of his relative YS Anand Reddy in Pulivendula, offered floral tributes, and consoled the bereaved family members.

వైయస్‌ ఆనంద్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పులివెందులలో పర్యటించారు. తమ బంధువు, కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పెదనాన్న వైయస్‌ ఆనంద్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. వైయస్‌ ఆనంద్‌రెడ్డి (87) కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గురువారం పులివెందులలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆనంద్‌రెడ్డి స్వగృహానికి చేరుకున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైయస్‌ భారతి కలిసి భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని ఆనంద్‌రెడ్డికి తుది వీడ్కోలు పలికారు.