చీరాల, జూలై 1 (నాదేశం) : వేటపాలెం మండలం సంపత్ నగర్ మూడురోడ్ల సెంటర్లో బుధవారం తెల్లవారుజామున ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. కేవలం ఆరు నెలల వయసున్న కత్తి అంజిబాబు అనే చిన్నారి అదృశ్యమయ్యాడు. షాపుల బయట తల్లి పక్క లో నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆ పసికందును ఎత్తుకెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం బాధిత తల్లిదండ్రులు మూడురోడ్ల సెంటర్లోని దుకాణాల బయట రాత్రి నిద్రించారు. వారి పక్కనే పడుకోబెట్టిన ఆరు నెలల అంజిబాబు తెల్లవారేసరికి కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి వచ్చి బాబును అపహరించుకుపోయినట్లు సిసి ఫుటేజీ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ఈ మేరకు చీరాల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన చిన్నారి కుడి చెవి వద్ద పుట్టుమచ్చ ఉంటుంది.
ఈ చిన్నారికి సంబంధించిన ఎలాంటి సమాచారం లభించినా, లేదా ఎవరికైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే చీరాల-2 టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు. పసికందు ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
#AndhraPradesh #ChandrababuNaidu #MineralMapping #Mining #RareEarthMinerals #CriticalMinerals #ValueAddition #IndustrialDevelopment #NaturalResources #APDevelopment #GoldMining #Jonnagiri #Chigurugunta #FreeSandPolicy #Infrastructure #EconomicGrowth #BreakingNews #LatestNews #AndhraNews #TeluguNews











