Home Inter National News మహిళ మార్ఫింగ్‌ ఫొటోలపై హైకోర్టు సీరియస్‌

మహిళ మార్ఫింగ్‌ ఫొటోలపై హైకోర్టు సీరియస్‌

24 గంటల్లో తొలగించాలని మెటాకు ఆదేశాలు .
సీజేపీ నేతలకు కోర్టు నోటీసులు జారీ.

జంతర్‌ మంతర్‌ ఆందోళనల సమయంలో ఓ మహిళ ఫొటోను అనుమతి లేకుండా మార్ఫింగ్‌ చేసి ప్రచారం చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సౌరవ్‌ దాస్‌, అభిజీత్‌ దిప్కే, ఆశుతోష్‌ రాంకా, రత్నా సింగ్‌లకు నోటీసులు జారీ చేసింది. సోషల్‌ మీడియా సంస్థ మెటాకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. మహిళకు సంబంధించిన అభ్యంతరకర ఫొటోలు, లింకులను తన ప్లాట్‌ఫారమ్‌ల నుంచి 24 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. మహిళకు పోలీసు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించిన కోర్టు.. కేసుపై రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు సమర్పించాలని సూచించింది. ఈ వ్యవహారం ఒక్క మహిళకు సంబంధించినది కాదని, దేశ ప్రధానికి సంబంధించిన అంశం కావడంతో అధికారులు సున్నితంగా వ్యవహరించాలని జస్టిస్‌ గిరీష్‌ కత్పాలియా వ్యాఖ్యానించారు.

ఏఐ మార్ఫింగ్‌పై పోలీసుల దర్యాప్తు

జంతర్‌ మంతర్‌లో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనల్లో తన ఫొటోను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఫేస్‌-స్వాప్‌ టెక్నాలజీతో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోతో కలిపి మార్ఫింగ్‌ చేశారని మహిళ ఆరోపించారు. ఆ చిత్రాలను భారీ బ్యానర్లు, పోస్టర్లపై ఉపయోగించడంతో పాటు అభ్యంతరకర నినాదాలు చేశారని, వీడియోను ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు. పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే నోటీసులు అందుకున్న సీజేపీ నేతలను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా పేర్కొనలేదు. జూన్‌ 20న ప్రారంభమైన సీజేపీ ఆందోళన జూలై 25 వరకు కొనసాగింది. పార్లమెంట్‌ వైపు మార్చ్‌ సందర్భంగా భద్రతా సిబ్బందితో ఘర్షణలు జరగడంతో లాఠీచార్జ్‌, టియర్‌ గ్యాస్‌ ప్రయోగం జరిగింది. అనంతరం ఆందోళన విరమించారు.

 

#DelhiHighCourt #MorphedPhotos #AIManipulation #FaceSwap #Meta #JantarMantar #SocialMedia #CPI #CPI_ML #SauravDas #AbhijitDipke #AshutoshRanka #RatnaSingh #DelhiPolice #CourtOrder