నీటిని ఎత్తిపోయండి.. నిల్వలు పెంచండి.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్‌రావు లేఖ ఞ.
గోదావరిలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నా రిజర్వాయర్లను నింపేందుకు మోటార్లు నడపకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. ఎల్లంపల్లి వద్ద భారీగా నీరు ఉన్నప్పటికీ మోటార్లు ఆన్ చేసి ఎత్తిపోకపోవడం వల్ల సాగునీటి నిల్వలు తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయని, 50 టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్లన్న సాగర్‌లో కేవలం 13 టీఎంసీలు, ఎల్‌ఎండీలో 11 టీఎంసీల నీరే ఉందని హరీశ్‌రావు తెలిపారు.
రిజర్వాయర్లు ఖాళీ.. రైతుల్లో ఆందోళన
రంగనాయక సాగర్‌లో నీటి కొరత కారణంగా సిద్దిపేట నర్మెట్టలోని పామాయిల్ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని హరీశ్‌రావు పేర్కొన్నారు. నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. గోదావరిలో వరద నీరు అందుబాటులో ఉన్న సమయంలోనే దాన్ని రిజర్వాయర్లకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎల్‌నినో వంటి కారణాలను చూపకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
24 గంటలు మోటార్లు నడపాలని డిమాండ్
ఇక ఆలస్యం చేయకుండా 24 గంటల పాటు అన్ని మోటార్లను నడిపించి మిడ్‌మానేరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్ సహా అన్ని రిజర్వాయర్లను నింపాలని హరీశ్‌రావు కోరారు. ప్రాజెక్టులపై రాజకీయాలు పక్కనపెట్టి రైతుల సాగునీటి అవసరాలు, ప్రజల తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వరద నీటిని సమర్థంగా వినియోగించకపోతే భవిష్యత్‌లో రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
#HarishRao #UttamKumarReddy #Godavari #GodavariFloods #Kaleshwaram #KaleshwaramProject #MallannaSagar #RanganayakaSagar #Yellampalli #TelanganaIrrigation #IrrigationWater #TelanganaFarmers #BRS #WaterCrisis #TelanganaNews











