Home National_news ఎన్నికలు రిగ్గయ్యాయా.. అలాంటప్పుడు పోటీ ఎందుకు?

ఎన్నికలు రిగ్గయ్యాయా.. అలాంటప్పుడు పోటీ ఎందుకు?

పోటీకి దూరంగా ఉండాలని దిప్కే హితవు .

కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దిప్కే ప్రతిపక్ష పార్టీలకు కీలక ప్రశ్న సంధించారు. ఎన్నికల ప్రక్రియ రిగ్గవుతోందని ఆరోపిస్తున్నప్పుడు అదే ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు నిజంగా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా లేవని భావిస్తే వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొనడం వల్లే అవి ప్రజాస్వామ్యబద్ధమైనవనే భావనకు బలం చేకూరుతోందని దిప్కే తన ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు.

రాజకీయ ఉనికిపైనే దిప్కే ప్రశ్న

ఎన్నికలకు దూరంగా ఉంటే రాజకీయంగా కనుమరుగవుతామనే భయంతోనే ప్రతిపక్షాలు పోటీ చేస్తున్నాయా అని దిప్కే ప్రశ్నించారు. ఓట్లు దొంగిలిస్తున్నారని, ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, పార్టీలు చీలిపోతున్నాయని ఆరోపిస్తూ కూడా ఎన్నికల్లో కొనసాగడం ఎంతకాలం సాధ్యమని ఆయన నిలదీశారు. రాజకీయ మనుగడ కంటే ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో కొన్ని విజయాలు ప్రతిపక్షాలకు దక్కినా, అవి మొత్తం ప్రక్రియపై నిష్పక్షపాత పోటీ ఉందనే భావన కలిగించేందుకు ఉపయోగపడతాయని దిప్కే అభిప్రాయపడ్డారు.

‘జంతర్‌ మంతర్‌ 2.0’ హెచ్చరిక

ఎన్నికల అవకతవకల ఆరోపణలను రాష్ట్రం, పార్టీ ఆధారంగా కాకుండా ప్రతిచోటా ఒకే విధంగా ప్రశ్నించాలని దిప్కే కోరారు. ప్రజాస్వామ్య ప్రయోజనాలను రాజకీయ ప్రయోజనాల కంటే ముందుకు తీసుకురావాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఇదే సమయంలో సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ 48 గంటల్లో రాజీనామా చేయాలని డిప్కే డిమాండ్‌ చేశారు. డిమాండ్‌ నెరవేరకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని, ఢిల్లీలో ‘జంతర్‌ మంతర్‌ 2.0’ నిర్వహిస్తామని ప్రకటించారు. సీజేపీ ఇప్పటికే ఎన్నికల సంఘం సంస్కరణల కోసం దేశవ్యాప్త ‘ఎలక్షన్‌ కమిషన్‌ ఠీక్‌ కరో’ ప్రచారాన్ని ప్రకటించింది.

 

#AbhijitDipke #CockroachJanataParty #ElectionCommission #GyaneshKumar #ElectionRigging #ElectionBoycott #FreeAndFairElections #ElectionReforms #OppositionParties #VoterFraud #ElectionControversy #JantarMantar2 #ElectionCommissionThikKaro #ElectionNews #IndianPolitics