Home AP నెల్లూరు పెద్దారెడ్డి కాదు.. పెద్దమ్మ

నెల్లూరు పెద్దారెడ్డి కాదు.. పెద్దమ్మ

అనిల్–ప్రసన్నతో సింహపురి శివంగి ఆట.
రాజుకుంటున్న వేమిరెడ్డి మైనింగ్ మంటలు.
నాకౌట్ పాలిటిక్స్‌లో విజేత ఎవరు?

నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు మాటల యుద్ధం కాదు.. మంటల యుద్ధం. ఒకవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. మధ్యలో అధికార టీడీపీకి చెందిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి. ఆమెకు అండగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి. మైనింగ్ ఆరోపణలతో మొదలైన పోరు ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, పాత రాజకీయ లెక్కలు, పోలీసు కేసుల ప్రస్తావన దాకా చేరింది. సెప్టెంబర్ 9న కోవూరులో అనిల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ వేడిని ఒక్కసారిగా పెంచగా.. మరుసటి రోజే ప్రశాంతిరెడ్డి ఇచ్చిన కౌంటర్ ప్రత్యర్థి శిబిరానికే షాక్ ఇచ్చింది. ఒకరు క్వార్ట్జ్ మైనింగ్ వ్యవహారాలను ప్రశ్నిస్తే.. మరొకరు గత రాజకీయ పరిచయాలను బయటకు తీశారు. దీంతో నెల్లూరు నాకౌట్ పాలిటిక్స్‌లో అసలు విజేత ఎవరు? అన్న చర్చ మొదలైంది. 2025లో ప్రసన్నకుమార్‌రెడ్డి–ప్రశాంతిరెడ్డి మధ్య మొదలైన వివాదం ఇప్పుడు అనిల్ ఎంట్రీతో కొత్త మలుపు తిరిగింది. “పెద్దమ్మ” వ్యాఖ్య నుంచి “సింహపురి శివంగి” కౌంటర్ వరకు ప్రతి మాట వెనుక రాజకీయ లెక్క కనిపిస్తోంది. మైనింగ్ మంటలు ఎక్కడికి దారి తీస్తాయి? అనిల్–ప్రసన్నతో వేమిరెడ్డి ఎలా ఆటాడుకుంటున్నారు? స్థానిక సంస్థల సమీకరణాల్లో ఎవరి పైచేయి? అసలు ఈ నాకౌట్ పాలిటిక్స్‌లో చివరి విజేత ఎవరు? అసలు కథ ముందుంది.

 

#NellorePolitics #NellorePoliticalWar #AnilKumarYadav #PrasannaKumarReddy #NallapareddyPrasanna #VemireddyPrashanthiReddy #VemireddyPrabhakarReddy #Vemireddy #NelloreMining #QuartzMining #MiningRow #AnilVsPrasanna #VemireddyPolitics #TDP #YSRCP #NelloreTDP #APPolitics #AndhraPradeshPolitics #NelloreNews #APPoliticalNews #LocalBodyElections #PoliticalWar