Home AP పేదలందరికీ సొంతింటి కల నిజం చేస్తాం: 15.54 లక్షల ఇళ్లు మంజూరు.. మంత్రి పార్థసారథి

పేదలందరికీ సొంతింటి కల నిజం చేస్తాం: 15.54 లక్షల ఇళ్లు మంజూరు.. మంత్రి పార్థసారథి

44
Will Provide Houses to All Poor

కూటమి ప్రభుత్వం పేదలందరికీ సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 15.54 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

గత వైసీపీ హయాంలో నిధులు విడుదల చేయకపోవడంతో గృహనిర్మాణ రంగం కుంటుపడిందని, వివిధ దశల్లో ఉన్న 4 లక్షల ఇళ్ల ప్రాజెక్టులను నాటి ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక నిలిచిపోయిన పనులను వేగవంతం చేసి, ఇప్పటికే 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. మిగిలిన 4.14 లక్షల ఇళ్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని, ఇందుకోసం ఈ పథకాన్ని మరో రెండేళ్లు పొడిగించామని మంత్రి తెలిపారు.