అప్పటికి చాలా సమయం ఉంది.
హిట్‌మ్యాన్ మాటతో పెరిగిన ఉత్కంఠ.
వరల్డ్‌కప్ 2027లో రోహిత్ శర్మ ఆడతాడా? లేదా? క్రికెట్ వర్గాల్లో నెలకొన్న ఈ ఉత్కంఠకు హిట్‌మ్యాన్ ఇచ్చిన ఒక్క సమాధానం మరింత సస్పెన్స్ పెంచింది. ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో పాల్గొన్న రోహిత్‌ను 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడటంపై ప్రశ్నించగా.. “అక్టోబర్ 2027 చాలా దూరంలో ఉంది.. అప్పుడే చూద్దాం” అంటూ క్లుప్తంగా స్పందించాడు. మాటలు చిన్నవే అయినా.. వాటి వెనుక భారీ ప్రశ్న మిగిలిపోయింది. ఇప్పటికే టీ20, టెస్ట్ క్రికెట్‌కు దూరమైన రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. పైగా తన చివరి వన్డేల్లోనూ బ్యాట్‌తో అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 138 పరుగులు చేసిన రోహిత్.. తనలోని పరుగుల ఆకలికి ఇంకా బ్రేక్ పడలేదని చాటాడు. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడని, అనవసర ఊహాగానాలకు తావులేదని స్పష్టం చేశారు. మరోవైపు 2027 ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే వరల్డ్‌కప్ ఇంకా ఏడాది దూరంలో ఉన్నా.. రోహిత్ ఒక్కమాట మాత్రం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది.
#RohitSharma #RohitSharma2027 #WorldCup2027 #RohitSharmaWorldCup #Hitman #TeamIndia #ODICricket #CricketWorldCup #BCCI #RohitSharmaFuture #IndianCricket #SouthAfrica2027











