అభ్యంతరాలకు అక్టోబర్ 7 వరకు ఛాన్స్.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ‘సర్’ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి గడువు పెంచింది. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 7 వరకు అవకాశం కల్పిస్తూ సవరించిన షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. గత షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ సెప్టెంబర్ 16తో ముగియాల్సి ఉండగా, మరింత సమయం కావాలని సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఈసీకి వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 7 వరకు వచ్చే అభ్యంతరాలు, క్లెయిమ్‌లను స్వీకరించి వాటిని పరిశీలించి పరిష్కరిస్తారు. అనంతరం నవంబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. ఈ నిర్ణయంతో ఓటరు జాబితాలో పేరు లేని వారు కొత్తగా నమోదు చేసుకునేందుకు, ఇప్పటికే ఉన్న వివరాల్లో తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు అదనపు సమయం లభించింది. ఎన్నికల ప్రక్రియలో ఓటు హక్కు కీలకమైన నేపథ్యంలో, అర్హులైన ప్రతి ఒక్కరూ గడువులోగా తమ వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
#TelanganaSIR #SIRTelangana #SIRDeadline #VoterList #TelanganaVoterList #ElectoralRoll #VoterRevision #ElectionCommission #TelanganaElections #VoterClaims #VoterObjections #October7 #November9 #RevanthReddy #SudarshanReddy #VoterRegistration #VoterDetails #TelanganaPolitics #TelanganaNews #ElectionNews











