Home Telangana పీసీసీ చీఫ్‌గా పొన్నం ప్రభాకర్ ఎంట్రీ

పీసీసీ చీఫ్‌గా పొన్నం ప్రభాకర్ ఎంట్రీ

వెయ్యి రోజుల ముంగిట.. మూడు పార్టీల మూడో లెక్క!
తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?

వెయ్యి రోజుల పాలన గడప దగ్గర తెలంగాణ కాంగ్రెస్‌లో అసలు రాజకీయ ఆట మొదలైంది. బయట బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి సవాళ్లు కనిపిస్తున్నా.. కాంగ్రెస్‌కు పెద్ద పరీక్ష మాత్రం ఇంటి లోపలే ఉంది. పీసీసీ చీఫ్‌గా పొన్నం ప్రభాకర్ పేరు వినిపించడం, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం తెరపైకి రావడంతో పార్టీ భవిష్యత్‌ సమీకరణాలపై ఆసక్తి పెరిగింది. ఇది కేవలం పదవుల మార్పు కాదు.. 2028 ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ రాజకీయ యంత్రాంగాన్ని రీసెట్‌ చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. మహేశ్‌కుమార్‌గౌడ్‌ మంత్రిగా వస్తే పొన్నంకు పీసీసీ పగ్గాలు దక్కే అవకాశం.. అటు రేవంత్‌రెడ్డికి పార్టీపై మరింత పట్టు, ఇటు సీనియర్లకు కొత్త సమీకరణాలు ఏర్పడే పరిస్థితి రావచ్చు. అయితే ఒకరికి పదవి అంటే మరొకరికి అసంతృప్తి అన్న ప్రమాదం కూడా ఉంది. ఈ మార్పులు కాంగ్రెస్‌కు బలం చేకూరుస్తాయా? లేక వర్గపోరుకు కొత్త తలుపులు తెరుస్తాయా? ఇదే ఇప్పుడు కీలక ప్రశ్న. మరోవైపు బీఆర్‌ఎస్‌ ‘వెయ్యి రోజుల విధ్వంసం’ అంటూ కాంగ్రెస్‌పై దాడికి సిద్ధమవుతోంది. బీజేపీ కూడా కొత్త నాయకత్వం, కొత్త వ్యూహంతో మూడో శక్తిగా ఎదగాలని చూస్తోంది. దీంతో వెయ్యి రోజుల ముంగిట తెలంగాణలో మూడు పార్టీల లెక్కలు మారుతున్నాయి. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. ఎవరి వ్యూహం 2028 దిశను మార్చబోతోంది? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసలు టాపిక్‌

 

#PonnamPrabhakar #PCCChief #TelanganaCongress #MaheshKumarGoud #RevanthReddy #TelanganaPolitics #CongressLeadership #2028Elections #BRS #BJP #TelanganaGovernment #CongressStrategy