Home Telangana మంత్రి కొండా సురేఖకు చెక్‌ అటవిశాఖలో కీలక ఉత్తర్వులు

మంత్రి కొండా సురేఖకు చెక్‌ అటవిశాఖలో కీలక ఉత్తర్వులు

డిప్యూటేషన్లు రద్దుతో బౌన్సర్ .

తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అటవిశాఖలో పలువురు ఐఎఫ్‌ఎస్‌ అధికారులు, ఇతర ఉన్నతాధికారుల డిప్యూటేషన్లను ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్‌పై ఉన్న అధికారులంతా పీసీసీఎఫ్‌ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వులు మంత్రి కొండా సురేఖకు సమాచారం లేకుండానే వెలువడ్డాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

గంటలోపే ఉత్తర్వులతో చర్చ

అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంపై రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించిన తర్వాత కొండా సురేఖ వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని సీఎం చెప్పిన కొద్దిసేపటికే అటవిశాఖలో డిప్యూటేషన్ల రద్దు ఉత్తర్వులు వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సురేఖకు తెలియకుండానే శాఖలో కీలక నిర్ణయాలు తీసుకోవడంపై చర్చ మొదలైంది. తాజా పరిణామం ఆమెకు ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

 

#KondaSurekha #TelanganaPolitics #TelanganaGovernment #ForestDepartment #ForestDepartmentTelangana #DeputationCancellation #IFSOfficers #GovernmentOrders #RevanthReddy #TelanganaCM #TelanganaCongress #Congress #KondaSurekhaNews #PoliticalControversy #TelanganaNews #HyderabadNews #TelanganaPolitics2026