Home General కార్గిల్‌ వీరులకు సచిన్‌ సెల్యూట్‌

కార్గిల్‌ వీరులకు సచిన్‌ సెల్యూట్‌

‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’పై భావోద్వేగం

‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’ను చూసిన తర్వాత తనలో ఎన్నో ఆలోచనలు కలిగాయని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ తెలిపారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం విధులు నిర్వర్తించే సైనికులు ఒత్తిడి, అనిశ్చితి మధ్య జీవిస్తుంటే.. మనం మాత్రం ప్రశాంతంగా నిద్రపోతూ సాధారణ జీవితాన్ని కొనసాగిస్తున్నామని ఆయన గుర్తుచేశారు. ఎన్నో ఏళ్ల క్రితం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవాను తాను కలిశానని సచిన్‌ చెప్పారు. ఇప్పుడు ‘ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌’లో కార్గిల్‌ యుద్ధ సమయంలో ఆయనతో పాటు ఎంతోమంది ఎదుర్కొన్న పరిస్థితులను చూసిన తర్వాత ఆ నాటి సమావేశాన్ని మరింత లోతైన గౌరవంతో గుర్తు చేసుకున్నానన్నారు. దేశం కోసం వారు ప్రదర్శించిన ధైర్యం అసాధారణమని, దాని వెనుక ఉన్న క్రమశిక్షణ, మానసిక స్థైర్యం మరింత గొప్పవని సచిన్‌ పేర్కొన్నారు. భారత వాయుసేనతో తనకు అనుబంధం ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వాయుసేన విలువలను అర్థం చేసుకునే అవకాశం తనకు లభించిందన్నారు. ఈ కథను చూసిన తర్వాత తనలో కృతజ్ఞత మరింత పెరిగిందని చెప్పారు. దేశ ప్రజల కోసం సేవలందిస్తున్న భారత వాయుసేన సిబ్బందికి “మీరు చేస్తున్న ప్రతి పనికి ధన్యవాదాలు.. జైహింద్‌” అంటూ సచిన్‌ భావోద్వేగంగా సెల్యూట్‌ చేశారు.

 

#SachinTendulkar #OperationSafedSagar #KargilWar #KargilHeroes #IndianAirForce #IAF #SachinTribute #BSDhanoa #IndianArmedForces #KargilWarHeroes #DefenceForces #JaiHind #SachinTendulkarNews