మువ్వన్నెల కాంతుల్లో భవనాలు.
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమరావతిలోని అసెంబ్లీ, సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. సచివాలయంలోని ఐదు భవనాలను మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక లైట్లతో తీర్చిదిద్దారు. అసెంబ్లీ భవనం సైతం రంగురంగుల విద్యుత్ కాంతులతో ఆకట్టుకుంటోంది. అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణ రహదారులు, సెంట్రల్ పార్కులో ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. విజయవాడలోని లోక్‌భవన్, ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, ప్రకాశం బ్యారేజ్, ఉండవల్లి గుహలు తదితర ప్రముఖ కట్టడాలను సైతం విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ అలంకరణలు అమరావతి నగరానికి ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.
#Amaravati #IndependenceDay #80thIndependenceDay #TricolourLights #AmaravatiLights #AndhraPradesh #APSecretariat #AssemblyBuilding #IndependenceDayCelebrations #Vijayawada #AmaravatiCelebrations #India











