Home AP రాయలసీమ మార్కెట్లకు పోటెత్తిన టమాటా

రాయలసీమ మార్కెట్లకు పోటెత్తిన టమాటా

అమరావతి: రాయలసీమ మార్కెట్లకు భారీగా 12,215 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చినట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రవి పట్టన్ శెట్టి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాణ్యత ఆధారంగా మార్కెట్లలో 5,564 మెట్రిక్ టన్నుల ఫస్ట్ గ్రేడ్, 6,650 మెట్రిక్ టన్నుల సెకండ్ గ్రేడ్ టమాటా లభిస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన టమాటా రాకతో కొన్ని మార్కెట్లలో స్వల్పంగా ధరలు పెరిగాయి. అధిక ఉత్పత్తి, భారీ రాకలతో కొన్ని మార్కెట్లలో స్వల్పంగా ధరలు తగ్గాయి.

అకాల వాతావరణ మార్పుల కారణంగా టమాటా క్వాలిటీ దెబ్బతింది. సీజన్ ముగింపు దశకు చేరింది. మార్కెట్‌కు నల్ల మచ్చలతో కూడిన టమాటా వచ్చింది. దెబ్బతిన్న, క్వాలిటీ తగ్గిన టమాటాలకు అధిక ధర ఇచ్చేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడంలేదు. ములకలచెరువులో టమాటా మార్కెటింగ్ సీజన్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. డిమాండ్, సప్లై ఆధారంగానే ధరల నిర్ణయం అవుతున్నాయి. కలికిరి మార్కెట్‌లో గత వారంతో పోలిస్తే మెరుగైన ధరలు లభిస్తున్నాయి.

రాప్తాడు ప్రైవేట్ మార్కెట్‌కు రికార్డు స్థాయిలో 6,750 మెట్రిక్ టన్నుల టమాటా వచ్చింది. పట్టికొండ, పీపుల్లి మార్కెట్లకు శుక్రవారం టమాటా రాలేదు. టమాటాను సరిగ్గా గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తెస్తేనే మెరుగైన ధర లభించే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ రైతులకు సూచించారు. మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 

#Rayalaseema #TomatoMarket #TomatoPrices #AndhraPradesh #TomatoArrivals #Agriculture #Farmers #Horticulture #Rapthadu #Mulakalacheruvu #Kalikiri #MarketUpdate #TomatoGrading #APNews #AgricultureNews

Previous article“మందుల”పై మూడో కన్ను తెరిచిన రాజన్న..
Next articleఆందోళన ముసుగులో అరాచకం! విద్యార్థుల పేరుతో విధ్వంసం
శిరందాసు నాగార్జున
నాగార్జున విశ్వవిద్యాలయంలో నుంచి బి.ఏ., బి.ఎల్., ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ డిగ్రీలు పూర్తి చేశారు. 1984 నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. ఉదయం, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి, ఆధాన్, పొలిటికోస్, హెచ్ఎంటీవీలలో రిపోర్టర్, సబ్ ఎడిటర్ నుంచి న్యూస్ ఎడిటర్ వరకు పని చేశారు. ఏపీ ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్ లో పీఆర్ఓ(అవుట్ సోర్సింగ్)గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిటికల్ అనలిస్ట్ గా చేశారు. కొద్ది కాలంపాటు తెలుగుదేశం పార్టీ పత్రిక ‘చైతన్య రథం’ బాధ్యతలుగా వ్యవహరించారు. తెలుగు దినపత్రికల ఎడిటోరియల్ పేజీలలో అన్ని రంగాలపై 700లకు పైగా వ్యాసాలు రాశారు. పుస్తక సమీక్షలు రాశారు. రాస్తున్నారు. ‘ప్రజారాజధాని అమరావతి’ అనే పుస్తకం కూడా రాశారు.