Home Telangana రేవంత్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు: హరీశ్‌రావు

రేవంత్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు: హరీశ్‌రావు

12

మాజీ మంత్రి హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఖమ్మం రైతు ఆశీర్వాద సభలో సీఎం చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధమని ఆరోపించారు. మాట తప్పడం, పార్టీలు మారడం రేవంత్‌రెడ్డి రాజకీయ శైలి అని విమర్శించారు. భద్రాద్రి రాముడి సాక్షిగా ప్రకటించిన సంపూర్ణ రుణమాఫీ హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బీఆరెస్‌తో రాజకీయంగా పోరాడాలని, రైతులపై కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దని సూచించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్‌రావు కోరారు