చెరుకుపల్లి, జూన్ 22(నాదేశం) : మనదేశ సంప్రదాయ పురాతన యుద్ధ కళ ‘శిలంభం’ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. తమిళనాడులోని సేలంలో జరిగిన 7వ అంతర్జాతీయ శిలంభం ఛాంపియన్‌షిప్‌లో బాపట్ల జిల్లా చెరుకుపల్లి కి చెందిన జై హనుమాన్ స్పోర్ట్స్ అకాడమీ విద్యార్థులు పతకాల పంట పండించారు. వివిధ దేశాల క్రీడాకారులకు గట్టి పోటీ ఇస్తూ స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో చరిత్ర సృష్టించారు. తమిళనాడు సేలంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక 7వ అంతర్జాతీయ శిలంభం ఛాంపియన్‌షిప్‌లో జై హనుమాన్ స్పోర్ట్స్ అకాడమీ కి చెందిన బి. చైతన్య, బి. హసిత్ లు అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్స్ సాధించగా.. జె. చాణక్య, ఎమ్. జ్యోతిర్మయి, బి. గ్రీష్మ శ్రీ లు సిల్వర్ మెడల్స్ కైవసం చేసుకున్నారు. వీరితో పాటు బి. భవ్య శ్రీ, బి. పూజ ప్రణవి,ఆశ్రిత సహా మొత్తం 9 మంది విద్యార్థులు బ్రాంజ్ మెడల్స్ సాధించి టోర్నీలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
మన సంప్రదాయ యుద్ధ కళ అయిన శిలంభంకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో విద్యార్థులకు కఠిన శిక్షణ ఇచ్చామని కోచ్ నాంచారయ్య తెలిపారు.తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈరోజు అంతర్జాతీయ వేదికపై పిల్లలు ఇన్ని మెడల్స్ సాధించగలిగారని నాంచారయ్య అన్నారు. రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని పతకాలు తెసుకుకు వచ్చేలా పిల్లలకు తర్ఫీదు ఇస్తామని తెలిపారు.
అంతర్జాతీయ వేదికపై పతకాలతో సరికొత్త చరిత్ర సృష్టించి, మన ప్రాంత కీర్తిని దశదిశలా చాటిన జై హనుమాన్ స్పోర్ట్స్ అకాడమీ విజేతలకు, కోచ్ నాంచారయ్యకు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు.
#Silambam #InternationalSilambamChampionship #Salem #TamilNadu #JaiHanumanSportsAcademy #Cherukupalli #Bapatla #AndhraPradesh #GoldMedal #SilverMedal #BronzeMedal #IndianMartialArts #TraditionalMartialArts #SportsAchievement #YouthTalent #Chaitanya #Hasith #Chanakya #Jyothirmayi #GreeshmaSri #BhavyaSri #PoojaPranavi #Ashritha #CoachNancharaiah #SportsNews #InternationalSports #MedalWinners #ProudMoment #IndianSports #NaDesam











