Home Sports_News బీసీసీఐ దాగుడుమూతలు.. రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ ఆడతారా?

బీసీసీఐ దాగుడుమూతలు.. రోహిత్, కోహ్లీ ప్రపంచకప్ ఆడతారా?

6
Rohit Sharma 2027 World Cup,

భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా లేదా అనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ వన్డే ప్రపంచకప్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన వివరాలు సామాన్య ప్రజల సమాచారం కోసం ఉద్దేశించినవి కావని ఆయన స్పష్టం చేశారు. బోర్డు రూమ్‌కే పరిమితమైన వ్యూహాలువ్యక్తిగత ఆటగాళ్ల భవిష్యత్తు గురించి బహిరంగంగా చర్చించడానికి దేవజిత్ సైకియా నిరాకరించారు.

జట్టుకు సంబంధించిన వ్యూహాత్మక ప్రణాళికలు ఎల్లప్పుడూ బోర్డు రూమ్‌లోనే ఉంచడం మంచిదని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి అంతర్గత విషయాలను మీడియా ముందు గాని, పబ్లిక్ లో గాని వెల్లడించడానికి తనకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ సమాధానంతో సీనియర్ల ప్రపంచకప్ భవితవ్యంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపికపై స్పష్టత ఇవ్వని మేనేజ్‌మెంట్రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ 2027 మెగా ఈవెంట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే సంకేతాలు ఇచ్చారు.

అయితే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు భవిష్యత్తు జట్టులో స్థానం ఉంటుందా అనే ప్రశ్నపై స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. ఈ విషయంలో సెలెక్షన్ కమిటీ, కోచ్, సపోర్ట్ స్టాఫ్, ఆటగాళ్లతో క్రమం తప్పకుండా చర్చలు జరుగుతూనే ఉంటాయని, ఇది ఒక నిరంతర ప్రక్రియ అని సైకియా వివరించారు.