Home AP ఏపీ అభివృద్ధికి కుల రాజకీయాలే పెద్ద శాపం.. పవన్ కల్యాణ్ నిప్పులు

ఏపీ అభివృద్ధికి కుల రాజకీయాలే పెద్ద శాపం.. పవన్ కల్యాణ్ నిప్పులు

8
Pawan Kalyan Caste Comments,

ఆంధ్రప్రదేశ్‌లో కులాల దరిద్రం వదిలితేనే రాష్ట్రం బాగుపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమాజంలో నేరాలను కూడా కుల కోణంలో చూడటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో డ్రైవర్‌ను దారుణంగా చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ఘోరమైన ఘటనను ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ సమయంలో లేని కులం, మానవత్వం ఇప్పుడు ఎందుకు గుర్తొస్తున్నాయని పవన్ కళ్యాణ్ నిలదీశారు.

రాష్ట్రంలో ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండి కూడా ఇలాంటి అన్యాయాలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. సమాజంలో జరిగే ప్రతి తప్పుపై, అన్ని విషయాలకూ తానే ఒక్కడినే మాట్లాడాలంటే ఎలా కుదురుతుందని మండిపడ్డారు. మీ నియోజకవర్గాల్లో సమస్యలు జరిగినప్పుడు మీకు పౌరుషం రాదా అని ప్రజాప్రతినిధులను సూటిగా నిలదీశారు. ప్రజలు కూడా కులాల పిచ్చిని వీడి చట్టాన్ని గౌరవించాలని హితవు పలికారు.