నేడు, రేపు పులివెందులలో వైసీపీ అధినేత
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు, రేపు పులివెందులలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పులివెందులకు చేరుకోనున్న జగన్, భాకరాపురంలోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం రాత్రి పులివెందులలోని తన నివాసంలో బస చేయనున్నారు. సెప్టెంబర్ 2న ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.45 గంటలకు ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. తండ్రి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది ఇడుపులపాయలో వైఎస్ జగన్ నివాళులు అర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి కూడా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వర్ధంతి కార్యక్రమం ముగిసిన అనంతరం జగన్ ఇడుపులపాయ నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఆయన పర్యటన నేపథ్యంలో స్థానిక పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.
#YSJagan #YSRCP #Kadapa #Pulivendula #Idupulapaya #YSR #YSRajasekharaReddy #YSRGhat #AndhraPradeshPolitics #JaganNews #YSRCPNews #APPolitics #JaganTour











