Home AP పొగాకు రైతులపై మాట్లాడే హక్కు లేదు

పొగాకు రైతులపై మాట్లాడే హక్కు లేదు


వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ సానా సతీష్ ఫైర్

రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన సానా సతీష్ బాబు, వైఎస్సార్‌సీపీ పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు మార్కెట్‌లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్రంతో సమన్వయం చేసుకుని వర్జీనియా పొగాకు కొనుగోళ్లకు రూ.188 కోట్లు కేటాయించామని చెప్పారు. కిలోకు రూ.20 ప్రోత్సాహకం ప్రకటించడంతో పాటు సుమారు 45 వేల మంది రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణాలు అందించామని వెల్లడించారు. పొగాకు ధర కిలోకు రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పొగాకు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని సానా సతీష్ బాబు ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 2022 తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని కూడా అన్నారు. రైతులను రక్షించే విషయంలో కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ఉందని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తమది రైతు పక్ష ప్రభుత్వం అయితే, వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులపై కేసులు పెట్టడం తప్ప మరేమీ జరగలేదని విమర్శించారు. రైతుల సమస్యలను రాజకీయాల కోసం ఉపయోగించకుండా, గత పాలనలో చేసిన తప్పులకు ముందుగా సమాధానం చెప్పాలని జగన్‌కు సానా సతీష్ బాబు సూచించారు.
పొగాకు రైతులపై మాట్లాడే హక్కు లేదు
వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ సానా సతీష్ ఫైర్

రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన సానా సతీష్ బాబు, వైఎస్సార్‌సీపీ పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచిందని తెలి
పొగాకు రైతులపై మాట్లాడే హక్కు లేదు
వైసీపీ అధినేత జగన్‌పై ఎంపీ సానా సతీష్ ఫైర్

రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన సానా సతీష్ బాబు, వైఎస్సార్‌సీపీ పాలనలో రైతుల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రం విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు మార్కెట్‌లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్రంతో సమన్వయం చేసుకుని వర్జీనియా పొగాకు కొనుగోళ్లకు రూ.188 కోట్లు కేటాయించామని చెప్పారు. కిలోకు రూ.20 ప్రోత్సాహకం ప్రకటించడంతో పాటు సుమారు 45 వేల మంది రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణాలు అందించామని వెల్లడించారు. పొగాకు ధర కిలోకు రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పొగాకు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని సానా సతీష్ బాబు ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 2022 తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని కూడా అన్నారు. రైతులను రక్షించే విషయంలో కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ఉందని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తమది రైతు పక్ష ప్రభుత్వం అయితే, వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులపై కేసులు పెట్టడం తప్ప మరేమీ జరగలేదని విమర్శించారు. రైతుల సమస్యలను రాజకీయాల కోసం ఉపయోగించకుండా, గత పాలనలో చేసిన తప్పులకు ముందుగా సమాధానం చెప్పాలని జగన్‌కు సానా సతీష్ బాబు సూచించారు.పారు. ప్రపంచవ్యాప్తంగా పొగాకు మార్కెట్‌లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కేంద్రంతో సమన్వయం చేసుకుని వర్జీనియా పొగాకు కొనుగోళ్లకు రూ.188 కోట్లు కేటాయించామని చెప్పారు. కిలోకు రూ.20 ప్రోత్సాహకం ప్రకటించడంతో పాటు సుమారు 45 వేల మంది రైతులకు రూ.50 వేల వడ్డీలేని రుణాలు అందించామని వెల్లడించారు. పొగాకు ధర కిలోకు రూ.200 కంటే తగ్గకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పొగాకు రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని సానా సతీష్ బాబు ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడంలో విఫలమైందని విమర్శించారు. 2022 తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదని కూడా అన్నారు. రైతులను రక్షించే విషయంలో కూటమి ప్రభుత్వానికి స్పష్టమైన కార్యాచరణ ఉందని, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. తమది రైతు పక్ష ప్రభుత్వం అయితే, వైఎస్సార్‌సీపీ పాలనలో రైతులపై కేసులు పెట్టడం తప్ప మరేమీ జరగలేదని విమర్శించారు. రైతుల సమస్యలను రాజకీయాల కోసం ఉపయోగించకుండా, గత పాలనలో చేసిన తప్పులకు ముందుగా సమాధానం చెప్పాలని జగన్‌కు సానా సతీష్ బాబు సూచించారు.

 

#SanaSatishBabu #YSJaganMohanReddy #TDP #YSRCP #TobaccoFarmers #AndhraPradesh #ChandrababuNaidu #FarmerWelfare #VirginiaTobacco #Agriculture #APPolitics #RajyaSabha