రాంచీ వేదికగా వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు భారత జట్టు ప్రాక్టీస్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరోసారి తన సత్తా చాటాడు. నెట్స్‌లో బంతిని బౌండరీలకు తరలిస్తూ సెలెక్టర్లకు కొత్త సందేశం పంపాడు. పక్కనే స్థానిక హీరో ఇషాన్ కిషన్ కూడా తనదైన దూకుడుతో విరుచుకుపడ్డాడు. రవి బిష్ణోయ్, నమన్ ధీర్, అభిషేక్ శర్మ బౌలింగ్‌ను ఎదుర్కొన్న ఇషాన్ భారీ షాట్లతో ఆకట్టుకున్నాడు. సంజూ శాంసన్ మాత్రం ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ క్లాస్ షాట్లతో అలరించాడు. సొంత మైదానంలో ఇషాన్‌పై బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ ప్రశంసలు కురిపిస్తూ, గతంతో పోలిస్తే అతడు మరింత పరిణతి సాధించాడని అన్నారు. అయితే అందరి చూపులు మాత్రం వైభవ్పైనే నిలిచాయి. ప్రతీ షాట్లో దూకుడు.. ప్రతీ బౌండరీలో భవిష్యత్ భారత స్టార్ మెరుపు కనిపించింది. ఇప్పటికే భారత టాప్ఆర్డర్లో చోటుపై చర్చ మొదలైన ఈ యువ సంచలనం, తనకు అవకాశం వస్తే ఏం చేయగలనో నెట్స్‌లోనే చూపించాడు. తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో గెలిచిన భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యం లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
#VaibhavSuryavanshi #TeamIndia #INDvsWI #IndiaVsWestIndies #T20I #IshanKishan #SanjuSamson #AbhishekSharma #RaviBishnoi #Ranchi #IndianCricket #CricketNews











