Home Telangana ఇంటికే మీ సేవ తెలంగాణ కొత్త అడుగు

ఇంటికే మీ సేవ తెలంగాణ కొత్త అడుగు

డిజిటల్‌ గవర్నెన్స్‌కు కొత్త రూపం.


ప్రభుత్వ సేవలను మరింత సులభంగా ప్రజల ఇంటి ముంగిటకే చేర్చేలా తెలంగాణ ప్రభుత్వం ‘మీ సేవా డోర్‌ డెలివరీ సర్వీసెస్‌’ను ప్రారంభించింది. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. సాంకేతికతను పాలనతో అనుసంధానించి పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు తెలంగాణను డిజిటల్‌ గవర్నెన్స్‌లో రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. ప్రజలు కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం తగ్గేలా ఈ విధానాన్ని రూపొందించారు.

1100కు కాల్‌.. ఇంటికే సేవలు

1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేయడం లేదా మీ సేవా పోర్టల్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవడం ద్వారా పౌరులు ఈ సేవలను పొందవచ్చు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఈసీ కాపీలు, ఐజీఆర్‌ఎస్‌ రిజిస్ట్రేషన్లు, పోలీస్‌ శాఖకు సంబంధించిన సేవలు ఇందులో ఉన్నాయి. తొలి దశలో ఎంపిక చేసిన క్యూర్‌ ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా సేవలు అమలు చేస్తున్నారు. ఇందుకోసం 70 మందికి పైగా మీ సేవా ఏజెంట్లు, వీఎల్‌ఈలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రజల స్పందనను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సేవలను విస్తరించనున్నారు.

 

#Telangana #MeeSeva #MeeSevaDoorDelivery #DigitalGovernance #TelanganaGovernment #1100Helpline #GovernmentServices #DoorstepServices #MeeSevaPortal #BirthCertificate #IncomeCertificate #CasteCertificate #ResidenceCertificate #IGRS #TelanganaNews