Home Telangana రేవంత్ మళ్ళీ సీఎం కావడం డౌట్

రేవంత్ మళ్ళీ సీఎం కావడం డౌట్


పచ్చ కాంగ్రెస్ తో పార్టీ మొత్తం ఔట్
అనుముల బ్రదర్స్ దోపిడి
మా జోలికొస్తే దేనికైనా రెడీ
కాక పుట్టించిన కొండా సుస్మిత

మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సంచలన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. పరకాల నియోజకవర్గంలో తన తల్లి జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడిన ఆమె.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో తన తండ్రి కొండా మురళి కూడా సహకరించారని ఆమె పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టే సమయంలో తన తండ్రి సహకారం ఉందని, అందుకు ప్రతిఫలంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చినా అది నెరవేరలేదని ఆరోపించారు.


బ్రదర్‌ కంపెనీ రహస్యాలు చెప్తా

కొండా సురేఖ కుమార్తె సుస్మితా పటేల్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. “నాకు టికెట్ ఇవ్వడానికి రేవంత్ ఎవరు?” అంటూ ప్రశ్నించారు. రేవంత్ ముఖ్యమంత్రా.. పొంగులేటి ముఖ్యమంత్రా అంటూ ఎద్దేవా చేశారు. తనను అనవసరంగా కెలికితే మరిన్ని విషయాలు బయటపెడతానని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన షెల్ కంపెనీకి రూ.200 కోట్లు ఇచ్చారంటూ ఆమె ఆరోపించారు.

రేవూరికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్న

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని కోరుకున్న తొలి వ్యక్తుల్లో కొండా దంపతులు ఉన్నారని గుర్తుచేశారు. కొండా మురళి రెండు, మూడు నియోజకవర్గాల్లో తిరిగి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారని పేర్కొన్నారు. పరకాలలో తన ఇల్లు ఇస్తానని, అక్కడే ఉండి రేవూరి ప్రకాశ్ రెడ్డిని గెలిపించుకోవాలని రేవంత్‌కు గతంలో చెప్పినట్లు తెలిపారు. రేవూరి గెలుస్తాడా.. కొండా మనిషి గెలుస్తాడా చూద్దామంటూ సవాల్ చేశారు. 119 నియోజకవర్గాల్లో టికెట్లు రేవంతే ప్రకటిస్తే పార్టీ అధిష్ఠానం ఎందుకని ప్రశ్నించారు.

 

#KondaSushmitha #KondaSurekha #KondaMurali #RevanthReddy #TelanganaCongress #Congress #TelanganaPolitics #Parakala #TelanganaPoliticalNews #CongressPolitics #PoliticalControversy #CongressLeadership #RevanthReddyCM #PonguletiSrinivasReddy #RevooriPrakashReddy #TelanganaNews #PoliticalNews #CongressTicket #TelanganaElections #KondaFamily