Home AP బీసీ సాధికారతకు టీడీపీ జై స్థానిక సంస్థలకు బీసీ బలం: లోకేశ్

బీసీ సాధికారతకు టీడీపీ జై స్థానిక సంస్థలకు బీసీ బలం: లోకేశ్



తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలకు అండగా నిలుస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు కీలక అడుగని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రభుత్వం బీసీలకు జైకొట్టిందని, జయహో బీసీ అని నినదిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994కు అనుగుణంగా రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకోవడం ద్వారా స్థానిక పాలనలో బీసీల భాగస్వామ్యం మరింత పెరగనుందని తెలిపారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం తీసుకురావడం పాలనను ప్రజలకు మరింత చేరువ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 13 జెడ్పీలను 28 జిల్లా పరిషత్‌లుగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కూడా వికేంద్రీకరణకు దోహదపడుతుందని లోకేశ్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల బలోపేతం, బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, పాలనా వికేంద్రీకరణ దిశగా ఈ నిర్ణయాలు మరో ముందడుగని ఆయన వెల్లడించారు.

 

#NaraLokesh #BCReservation #BCEmpowerment #AndhraPradesh #TDP #TDPGovernment #BCQuota #LocalBodyElections #APLocalElections #BCPoliticalRepresentation #JaiHoBC #TDPAndBCs #PanchayatRaj #AndhraPradeshPolitics #APPolitics #LocalGovernance #PoliticalEmpowerment #Decentralisation #ZillaParishads #APCabinet