ఓటరు నమోదు ప్రక్రియలో మంత్రి లోకేశ్! ఉండవల్లి నివాసంలో వివరాల నమోదు

14

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉండవల్లిలోని తన నివాసానికి వచ్చిన బూత్ లెవల్ ఆఫీసరుకు ఆయన పూర్తి సహకారం అందించారు. వారు అడిగిన అన్ని వివరాలను తెలుపుతూ.. అవసరమైన గుర్తింపు పత్రాలను, డాక్యుమెంట్లను మంత్రి లోకేశ్ స్వయంగా అందజేశారు. ఓటరు జాబితా సవరణ, అర్హుల నమోదు కోసం జరుగుతున్న ఈ ప్రత్యేక ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన పౌరులు, ముఖ్యంగా యువత ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఓటరు జాబితాలో తమ పేర్లు సరిచూసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని లోకేశ్ పేర్కొన్నారు.

 

#NaraLokesh #SIR #SpecialIntensiveRevision #ElectionCommission #VoterVerification #AndhraPradesh #Undavalli #VoterListRevision #ElectoralRolls #Democracy #YouthVoters #APPolitics #DigitalGovernance #VotingRights #BreakingNews