Home AP స్తీశక్తి పథకానికి ఏడాది పూర్తి మహిళతో కలసి బస్సులో బాబు ప్రయాణం

స్తీశక్తి పథకానికి ఏడాది పూర్తి మహిళతో కలసి బస్సులో బాబు ప్రయాణం


పథకం అమలు తీరుతెన్నులపై సంభాషణ.
మహిళల ఆర్థికాభివృద్దికి దోహదపడుతోందన్న సీఎం.

కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీశక్తి ఉచిత బస్సు పథకానికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించారు. రాజధానిలోని పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి సీఎం క్యాంపు కార్యాలయం వరకు ప్రయాణిస్తూ వివిధ జిల్లాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పథకం వల్ల కలుగుతున్న ప్రయోజనాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార మహిళకు నెలకు రూ.4 వేలు, నంద్యాల మహిళకు రూ.1,500, మరో యువతికి రూ.3 వేల వరకు ప్రయాణ ఖర్చు ఆదా అవుతోందని మహిళలు సీఎంకు వివరించారు. చేనేత మహిళలు ముడిసరుకు కొనుగోలు, చీరల మార్కెటింగ్‌ కోసం ఉచిత ప్రయాణం ఉపయోగపడుతోందని చెప్పారు. విద్యార్థినులకు కూడా ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు.

87 కోట్ల ఉచిత ప్రయాణాలు

స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటివరకు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని, రోజుకు 24 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని 9,978 బస్సుల్లో 7,631 బస్సుల్లో ఈ పథకం అమలవుతోందని చెప్పారు. అంటే 76 శాతం బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుతోందన్నారు. పథకం అమలుకు ముందు బస్సు ప్రయాణాల్లో మహిళల వాటా 40 శాతం ఉంటే.. ప్రస్తుతం అది 62 శాతానికి పెరిగిందని వివరించారు. మహిళల ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడటం, కుటుంబాల ఆర్థిక పరిస్థితి బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల్లో రూ.25 వేల కోట్ల పొదుపు సొమ్ము ఉందని తెలిపారు. మహిళలు రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని ప్రశంసించారు. గంజాయి, బ్లేడ్‌ బ్యాచుల నిర్మూలనలో మహిళలు భాగస్వాములు కావాలని, రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడేవారిని అడ్డుకునే చైతన్యం పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

 

#StreeShakti #StreeShaktiScheme #FreeBusScheme #AndhraPradesh #ChandrababuNaidu #WomenEmpowerment #WomenWelfare #FreeBusTravel #APGovernment #APNews #WomenEconomicEmpowerment #87CroreJourneys #DWCRA #APWomen #PublicTransport #WomenPassengers #AndhraPradeshGovernment #APDevelopment #Chandrababu #GovernmentSchemes