చీరాలలో ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ ర్యాలీ

19

మత్తు రహిత సమాజమే లక్ష్యం

చీరాల,జూన్ 26(నాదేశం) : మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘నిషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రూట్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డిఎస్పీ మోయిన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.

చీరాల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ రూట్ మార్చ్.. పట్టణంలోని ప్రధాన కూడళ్లగుండా సాగిన ఈ ర్యాలీలో పోలీసులు, యువత మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు.

ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ ఎండి. మోయిన్, వన్‌టౌన్ సీఐ సోమశేఖర్ మాట్లాడుతూ.. నేటి యువత మత్తు పదార్థాల వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మారుల వల్ల పచ్చని జీవితాలు ఎలా చిన్నాభిన్నం అవుతాయో ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు వివరించారు. సమాజం నుంచి మత్తు భూతాన్ని పారద్రోలడానికి పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు.
ఈ అవగాహన రూట్ మార్చ్ కార్యక్రమంలో వన్‌టౌన్ పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు స్థానిక పట్టణ ప్రముఖులు, యువకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

#NashaMuktBharat #NashaMuktBharatAbhiyan #Chirala #Bapatla #AndhraPradeshPolice #DrugFreeIndia #DrugAwareness #AntiDrugsCampaign #RouteMarch #ChiralaPolice #PublicAwareness #YouthAwareness #SayNoToDrugs #PoliceAwareness #BapatlaNews #BreakingNews #LatestNews #TeluguNews #SocialAwareness #DrugFreeSociety