Home Business మెటా పెయిడ్ సర్వీసుల మోత

మెటా పెయిడ్ సర్వీసుల మోత

17
face book payment

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాలు చాలా కాలంగా ఉచితంగా లభిస్తూ వచ్చాయి. పరిమిత మోతాదులు ఉపయోగించేవారికి మాత్రమే ఇప్పుడు మెటా సంస్థ వినియోగదారులనుండి డబ్బులువసూలు చేయడం ప్రారంభించింది. వాట్సాప్ వెబ్ వాడుతున్నప్పుడు ‘వాట్సాప్ ప్లస్’ సబ్ స్క్రిప్షన్ కోసం నోటిఫి కేషన్లు వస్తున్నాయి. దీని ద్వారా అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఇన్స్టాగ్రామ్ ప్లస్, ఫేస్బుక్ ప్లస్ కోసం నెలకు 99 రూపాయలు చెల్లించాలి. వాట్సాప్ ప్లస్ కూడా నెలకు 99 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం భారతదేశంలో దీనిపై యాభై శాతం తగ్గింపు ఇస్తున్నారు. పవర్ యూజర్ల కోసం మెటావన్ ప్లస్ నెలకు 775 రూపాయలు, మెటా సన్ ప్రీమియం నెలకు 1,939 రూపాయలుగా ఉంది. దీనివల్ల ఎక్కువ ఏఐ సామర్థ్యాలు అందుబాటులోకి వస్తాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఖర్చులు

మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఏఐ సాంకేతికతపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇతర సంస్థలతో పోటీ పడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. స్కేల్ ఏఐ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్ను మెటా సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ కు నాయకత్వం వహించడానికి 14.3 బిలియన్ డాలర్లతో నియమించుకున్నాడు. 2026 సంవత్సరానికి గాను ఏఐ మౌలిక సదుపాయాలు, డేటా సెంటర్ల కోసం మెటా తన పెట్టుబడి అంచనాను 125 బిలియన్ల నుండి 145 బిలియన్ డాలర్లకు పెంచింది. భారతదేశంలో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్లో కలిసి గుజరాత్లోని జామ్నగర్లో ఏఐ డేటా సెంటర్ ను నిర్మించడానికి ఒప్పందం చేసుకుంది.

సంస్థ అంతర్గత సవాళ్లు

మెటా సంస్థ కేవలం ప్రకటనల ద్వారానే 97.6 శాతం ఆదాయాన్ని పొందుతోంది. గూగుల్ సంస్థతో పోలిస్తే మెటా ఇతర రంగాలలో ఆదాయాన్ని సాధించడంలో వెనుకబడింది. ఈ ప్రకటనల ఆధారిత మోడల్ నుండి బయటపడటానికి సబ్ స్క్రిప్షన్లు అవసరమని జుకర్ బర్గ్ భావిస్తున్నారు. ఈ సబ్ స్క్రిప్షన్ల ద్వారా 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే సంస్థలో ఉద్యోగుల తొలగింపులు, కొత్త నిపుణుల జీతాల పట్ల పాత సిబ్బందిలో అసంతృప్తి నెలకొంది. సాధారణ వినియోగదారులు డబ్బులు చెల్లించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రొసైట్ మార్పులు, స్టోరీ వీక్షణలు వంటి చిన్న ఫీచర్ల కోసం డబ్బులు పెట్టడం వృథా అని భావిస్తున్నారు. ఏఐ ఖర్చులను భరించడానికి మెటా ఈ తాత్కాలిక మార్గాన్ని ఎంచుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.