Home AP జనం బెంబేలెత్తేలా పరామర్శలా? జగన్ పర్యటనలపై హోం మంత్రి విమర్శలు

జనం బెంబేలెత్తేలా పరామర్శలా? జగన్ పర్యటనలపై హోం మంత్రి విమర్శలు



వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఆరోపించారు. 2024 ఎన్నికల తర్వాత జగన్ చేపట్టిన పర్యటనల్లో జరిగిన ఘటనలను మీడియా సమావేశంలో వీడియోలతో ప్రదర్శిస్తూ ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండున్నరేళ్లలో జరిగిన పర్యటనల సందర్భంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని, అనేక చోట్ల విధ్వంసం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. గంజాయి, తాగుబోతు బ్యాచ్‌లతో బలప్రదర్శనలు చేస్తూ సామాన్య ప్రజలు, రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు, చట్టాలను కూడా లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని, పరామర్శల పేరుతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని విమర్శించారు.

జెన్-జీ కాదు.. గంజాయి బ్యాచ్
ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షానికి ఉన్నప్పటికీ, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను సమర్థించలేమని అనిత స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ వివాదాలకు తెరలేపుతోందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాల విషయంలో ఎలాంటి అవకతవకలు లేవని కోర్టులే స్పష్టం చేశాయని గుర్తు చేశారు. జగన్ వెంట ఉన్నవారు “జెన్-జీ” కాదు, “గంజాయి బ్యాచ్” అని వ్యాఖ్యానిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రజలు మంచి నాయకత్వాన్ని, విధ్వంసక రాజకీయాలను వేరు చేసి గమనించాలని, భవిష్యత్ తరాల కోసం బాధ్యతాయుతమైన రాజకీయాలను ప్రోత్సహించాలని హోంమంత్రి పిలుపునిచ్చారు.

 

#VangalapudiAnitha #YSJagan #YSRCP #ChandrababuNaidu #AndhraPradesh #APPolitics #LawAndOrder #TDP #PoliticalNews #DSC #JaganTour #HomeMinister #APGovernment #Politics