Home Telangana గణేశ్‌ నిమజ్జనం 25న ప్రభుత్వ సెలవు

గణేశ్‌ నిమజ్జనం 25న ప్రభుత్వ సెలవు

గణేశ్‌ నిమజ్జన మహాశోభాయాత్ర నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 25న శుక్రవారం హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించింది. ఈ సెలవుకు బదులుగా నవంబర్‌ 14న రెండో శనివారం పనిదినంగా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. నిమజ్జన వేడుకలకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో హైదరాబాద్‌ నగర పోలీసు శాఖ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

 

#GaneshImmersion2026 #September25Holiday #HyderabadHoliday #Secunderabad #GaneshNimajjanam #MahaShobhayatra #TelanganaGovernment #Rangareddy #MedchalMalkajgiri #HyderabadSchools #HyderabadColleges #GaneshFestival #GaneshShobhayatra #Telangana #Hyderabad