రాజకీయంగా దారులన్నీ మూసుకుపోయాయా?
కానీ జనసేన ఆప్షన్ ఉండదంటున్న అభిమానులు!
కొండా దంపతుల పయనమెటు? ఒకప్పుడు ప్రత్యర్థులకు వణుకు పుట్టించిన కొండా దంపతులు.. ఇప్పుడు రాజకీయ దారుల కోసం వెతుకుతున్నారా? తెలంగాణ రాజకీయాల్లో కొండా దంపతుల చుట్టూ నెలకొన్న పరిణామాలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. ఒకవైపు కూతురు సుస్మిత వ్యాఖ్యలు.. మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం హెచ్చరికలు.. మధ్యలో కొండా సురేఖ రాజకీయ భవిష్యత్తుపై సందిగ్ధత. బిడ్డకు అండగా నిలిస్తే పార్టీతో దూరం పెరిగే పరిస్థితి.. పార్టీతో కొనసాగితే కుటుంబపరమైన ఒత్తిడి తప్పని పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వెళ్లాలనుకుంటే మాత్రం ప్రత్యామ్నాయ ద్వారాలు కూడా అంత సులభంగా తెరుచుకోవడం లేదు. బీఆర్ఎస్ నుంచి గట్టి నిరాకరణ.. బీజేపీ నుంచి అసంతృప్త నేతలపై స్పష్టమైన సంకేతాలతో కొండా దంపతుల ముందున్న ఆప్షన్లు క్రమంగా తగ్గుతున్నాయన్న చర్చ సాగుతోంది. గతంలో ప్రత్యర్థులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాజకీయ లెక్కల్లోకి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ రాజకీయ పునాది కాపాడుకోవడమా.. లేక జనసేన రూపంలో కొత్త దారి వెతుక్కోవడమా? కుటుంబం ఒక దిశలో.. రాజకీయ ప్రయాణం మరో దిశలో సాగుతున్న వేళ.. కొండా దంపతుల తదుపరి అడుగు ఏంటి? ಇದೇ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన ప్రశ్నగా మారింది.
#KondaSurekha #KondaMurali #KondaCouple #KondaSurekhaPoliticalFuture #TelanganaPolitics #TelanganaCongress #Congress #BRS #BJP #JanaSena #PawanKalyan #SusmithaKonda #KondaSurekhaBRS #KondaSurekhaBJP #TelanganaPoliticalNews











