Home Telangana స్మార్ట్ రేషన్‌ కార్డుల.. కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్

స్మార్ట్ రేషన్‌ కార్డుల.. కాంగ్రెస్‌ మాస్టర్‌ ప్లాన్


కోటి 5 లక్షల మందికి కొత్త కార్డులు: జగ్గారెడ్డి.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కోటి 5 లక్షల మందికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు అందించబోతోందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి తెలిపారు. స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రజల జీవితాల్లో కీలక మార్పు తీసుకొచ్చే విప్లవాత్మక నిర్ణయమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించి కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జగ్గారెడ్డి పరిశీలించారు. తారా డిగ్రీ కళాశాలలో హెలిప్యాడ్‌, అంబేడ్కర్‌ స్టేడియంలో సభా ప్రాంగణాన్ని కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల బీఆరెస్‌ పాలనలో కొత్త రేషన్‌ కార్డుల విషయంలో ప్రజలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్‌ కార్డులతో పాటు స్మార్ట్‌ కార్డులు అందించేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. సంగారెడ్డి సభకు సుమారు 50 వేల మందిని సమీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

 

#SmartRationCards #Telangana #JaggaReddy #RevanthReddy #Congress #TelanganaGovernment #RationCards #NewRationCards #TelanganaPolitics #Sangareddy #UttamKumarReddy #CongressGovernment #TelanganaNews #GovernmentSchemes #SmartCards