ఆక్వా రంగమే చంద్రబాబు మానసపుత్రిక
వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు
పాలకొల్లులో జరిగిన ఆక్వా సభలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆక్వా రంగంపై ప్రభుత్వ ప్రాధాన్యాన్ని వివరించారు. ఆక్వా రంగం సీఎం చంద్రబాబు మానసపుత్రిక అని, రైతులకు ఇచ్చిన హామీ మేరకు అర్హత ఉన్న ప్రతి ఆక్వా రైతుకూ యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తున్నట్లు తెలిపారు. జోన్, నాన్‌జోన్‌తో సంబంధం లేకుండా, పదెకరాల పరిమితి లేకుండా రాయితీ వర్తిస్తుందని చెప్పారు. పాలకొల్లులోనే రైతుల సమక్షంలో జీవో నంబర్ 57 విడుదల చేయడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆక్వా విద్యుత్ సబ్సిడీకి రూ.724 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.1,150 కోట్లు కేటాయించిందని వివరించారు. ఫిష్‌మీల్, ఫిష్ ఆయిల్ ధరలను 50 శాతం వరకు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో ఆక్వా ఫీడ్ ధరలు తగ్గే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ మార్కెట్ సవాళ్లు, అమెరికా టారిఫ్‌లు, రొయ్యల ధరల పతనం సమయంలో రైతులు, పరిశ్రమల ప్రతినిధులను ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంతో చర్చించామని చెప్పారు. ఆక్వా ఫీడ్ ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను బ్లూ ఎకానమీలో దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
#AndhraPradesh #AquaFarmers #Aquaculture #ChandrababuNaidu #Atchannaidu #AquaSector #AquaSubsidy #ElectricitySubsidy #ShrimpFarmers #AquaFeed #BlueEconomy #APGovernment #CoalitionGovernment #Agriculture #Farmers











