ఆ గట్టు, ఈ గట్టు… ఏ గట్టయినా నెల్లూరు పెద్దారెడ్డిదే హవా.
నెల్లూరు నల్లేరు మీద నడక కాదు.. సింహపురిని స్వీప్ చేయడం ఈజీ కాదు..
మారుతున్న జనం మైండ్ సెట్.. ప్రభుత్వ వ్యతిరేకతే వైసీపీ టార్గెట్.
విక్రమపురి నుంచి రాజకీయసింహపురిలో ట్విస్టులే ట్విస్టులు.
కృష్ణపట్నం రేవు కాడ ఓడెక్కి.. బెజవాడ సెంటర్‌లో దిగుదామా అనుకుంటే మధ్యలో నెల్లూరు సెంటర్‌లోనే దిగాల్సిందేనేమో! ఎందుకంటే నెల్లూరు రాజకీయాలంటే మామూలు రాజకీయం కాదయ్యా.. ఆ గట్టు, ఈ గట్టు.. ఏ గట్టయినా ఇక్కడ లెక్కలు మాత్రం పెద్దారెడ్డి స్టైల్లోనే తిరుగుతాయ్! నిన్న మొన్నటి పార్టీ ఏదో.. రేపటి కండువా ఏదో చెప్పడం కష్టం. ఎవరి జెండా ఎగిరినా.. ఎవరి ప్రభుత్వం నడిచినా.. నెల్లూరు రాజకీయ గల్లీల్లో పలుకుబడి ఉన్నోడే అసలు ప్లేయర్. అందుకే విక్రమసింహపురి రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే ఎన్నికల ఫలితాలు చూసి సరిపెట్టుకుంటే కుదరదు. ఇక్కడ కుటుంబం ఒక శక్తి.. డబ్బు ఒక బలం.. పరిచయాలు మరో ఆయుధం.. కార్యకర్తల నెట్‌వర్క్ ఇంకో కోట. ఒకప్పుడు భూమి మీద పట్టు ఉంటే రాజకీయాల్లో పట్టు వచ్చేది. తర్వాత కాంగ్రెస్ నీడలో పెరిగిన కుటుంబాలు అధికారాన్ని చవిచూశాయ్. ఆ తర్వాత టీడీపీ, వైసీపీ వచ్చాయి.. రాజకీయ పెద్దలు గట్లు మార్చారు.. కానీ పాత సంబంధాలు మాత్రం గాలిలో కలిసిపోలేదు. ఆనం, మేకపాటి, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మాగుంట, వేమిరెడ్డి.. పేర్లు మారినా కథలో అసలు ట్విస్టు మాత్రం ఒకటే. ఎవరి చేతిలో ఏ టైమ్‌లో రాజకీయ తాళం ఉంటుందన్నదే లెక్క! 2019లో వైసీపీకి పది సీట్లు కట్టబెట్టిన నెల్లూరు ఓటరే 2024లో టీడీపీకి పదికి పది ఇచ్చాడు. ఇదే నెల్లూరు స్టైలు.. నాయకుడు ఎక్కడున్నా పర్లేదు.. చివరికి ఓటరు ఎక్కడ నిలబడతాడో అదే అసలు పెద్దారెడ్డి లెక్క!
#NellorePolitics #Nellore #AndhraPradeshPolitics #YSRCP #TDP #NellorePoliticalBattle #NelloreVoters #PoliticalStrategy #AndhraPolitics #2029Elections #PoliticalTrends #NelloreNews #APPolitics #PoliticalAnalysis











