Home AP స్థానిక ఎన్నికలకు చంద్రబాబు పక్కా వ్యూహం

స్థానిక ఎన్నికలకు చంద్రబాబు పక్కా వ్యూహం

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం సహచర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన, కూటమి అభ్యర్థుల విజయ బాధ్యతను ఇన్‌ఛార్జ్‌ మంత్రులే తీసుకోవాలని సూచించారు. నవంబర్‌ 15వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి, సాధారణ పాలనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి 100 శాతం విజయాలు సాధించేలా ప్రతి మంత్రి క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు విజయానికి అవసరమైన చర్యలను సమన్వయంతో చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడంతోపాటు, కూటమి అభ్యర్థుల గెలుపునకు అనుసరించాల్సిన కార్యాచరణపై మంత్రులకు సూచనలు చేశారు. ఎన్నికల బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా సమష్టిగా పనిచేయాలని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల గడువు, వంద శాతం విజయ లక్ష్యం నేపథ్యంలో మంత్రుల పనితీరుకు ప్రాధాన్యం పెరిగింది.

#ChandrababuNaidu #APLocalBodyElections #AndhraPradeshPolitics #LocalElections2026 #TDP #JanaSena #BJP #CoalitionStrategy #APCabinet #ElectionCampaign #MinisterialResponsibilities #AndhraPradeshNews