Home AP నువ్వు ఇంచార్జ్ మంత్రి అయితే ఏంటి?

నువ్వు ఇంచార్జ్ మంత్రి అయితే ఏంటి?

నేను ప్రభుత్వ విప్‌.
మంత్రి సవితకు కడప రెడ్డెమ్మ ఛాలెంజ్‌!
రెడ్డెప్పగారి ప్రత్యర్థులతో సవిత ములాఖత్‌.
మేయర్‌ పీఠం కోసం మహిళా నేతల ఫైట్‌.

కడపలో బయటకు కనిపించేది ఒకే పార్టీ.. కానీ లోపల మాత్రం రాజకీయం తీన్మార్ ఆడుతోంది. ఒకవైపు 2024 ప్రజా తీర్పుతో వచ్చిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మాధవి రెడ్డి ఆధిపత్యం.. మరోవైపు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితకు ఉన్న సమన్వయ బాధ్యతలు.. మధ్యలో పుత్తా నరసింహారెడ్డి పాత రాజకీయ పట్టు.. ఇప్పుడు మేయర్‌ రేసులో వినిపిస్తున్న ఉమాదేవి పేరు. 66 డివిజన్లుగా విస్తరించిన కడప కార్పొరేషన్‌ ఈ సమీకరణాలన్నింటికీ వేదికగా మారింది. ఎవరికి టికెట్‌? ఎవరికి ప్రాధాన్యం? జనసేనతో ఎక్కడ సర్దుబాటు? అన్న లెక్కల కంటే.. రేపటి మేయర్‌ పీఠంపై ఎవరి మాట వినిపించాలన్నదే అసలు అంతర్గత లెక్కగా మారిందన్న చర్చ సాగుతోంది. రాజ్యసభ అంశంపై వినిపిస్తున్న ఆరోపణలు, పాత టికెట్‌ వివాదాలు, ప్రత్యర్థి వర్గాల నేతల భేటీలు, మేయర్‌ అభ్యర్థిత్వంపై పోటీ.. ఇవన్నీ కలసి కడప టీడీపీలో కొత్త శక్తి సమీకరణాలకు దారితీస్తున్నాయన్న చర్చకు బలం చేకూరుస్తున్నాయి. డివిజన్ల టికెట్ల దగ్గర అసలు లెక్క ఎలా మారుతుంది? మేయర్‌ పీఠం కోసం ఎవరి వ్యూహం ఎటు మలుపు తిరుగుతుంది? కడప టీడీపీలో చివరకు ఎవరి మాటకు ప్రాధాన్యం దక్కుతుంది? ఇదే ఇప్పుడు అసలు ఉత్కంఠ.

 

#KadapaPolitics #KadapaTDP #MadhaviReddy #SSavita #KadapaMayor #MayorRace #KadapaMunicipalCorporation #TDP #TDPPPolitics #APPolitics #LocalBodyElections #KadapaElections #PoliticalEquations #AndhraPradeshPolitics #Kadapa