ఓటర్ల తొలగింపు అంటే రాజ్యాంగం మౌలిక స్ఫూర్తిపై దాడి.
సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సంచలన వ్యాఖ్యలు.
ఒక పేరు ఓటర్ల జాబితా నుంచి మాయమైతే.. అది కేవలం ఒక ఎంట్రీ తొలగింపేనా? లేక ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడి గొంతుకే తాళం పడినట్టా? దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ.. సర్.. చుట్టూ రగులుతున్న వివాదం ఇప్పుడు ఈ ప్రశ్నను రాజ్యాంగం గుండెదాకా తీసుకెళ్లింది. ఈ వేడి సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేసిన వ్యాఖ్యలు సంచలన చర్చకు తెరలేపాయి. కోట్లాది మంది పౌరులు ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే.. అలాంటి ప్రక్రియను ఎలాంటి కారణాలతోనూ సమర్థించలేమని ఆయన స్పష్టం చేశారు. “ఓటు హక్కును పౌరుడి నుంచి వేరు చేయడం అంటే శరీరం నుంచి ఆత్మను తీసినట్టే” అన్న ఆయన మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల నుంచి న్యాయ నిపుణుల వరకు ప్రతిధ్వనిస్తున్నాయి. ఒకవైపు ఓటర్ల జాబితా స్వచ్ఛంగా ఉండాలంటున్న ఎన్నికల సంఘం.. మరోవైపు అర్హులైన ఒక్క పౌరుడి పేరు కూడా అన్యాయంగా తొలగిపోకూడదంటున్న రాజ్యాంగ ఆందోళన.. మధ్యలో అసలు ప్రశ్న ఒక్కటే. పేరు తొలగించే అధికారం ఎక్కడి వరకు? ఓటు హక్కుకు రక్షణ ఎక్కడి నుంచి? సర్పై సుప్రీంకోర్టు ఇప్పటికే ఏం చెప్పింది? ఎన్నికల సంఘం ఇప్పుడు ఏ చర్యలు చేపట్టింది? జస్టిస్ భుయాన్ అసలు ఎవరిని ఉద్దేశించారు? ఓటు హక్కు రాజ్యాంగంలో ఎంత కీలకం? ప్రజాస్వామ్యానికి ఇది ఎందుకు కీలక మలుపు?
#JusticeUjjalBhuyan #VoterRights #VoterDeletion #SIR #SpecialIntensiveRevision #SupremeCourt #ElectionCommission #RightToVote #Article14 #Article326 #ElectoralRolls #Disenfranchisement #ConstitutionOfIndia #IndianDemocracy #ElectionNews











