నాయకత్వ మార్పుతోనే కాంగ్రెస్‌కు మోక్షం.
షర్మిల పర్సనల్ ఎజెండా.. కనుమరుగైన కాంగ్రెస్ జెండా.
గతమేంతో ఘనం.. భవిష్యత్ శూన్యం.
ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు కాంగ్రెస్ పేరు వినిపిస్తే కదిలే రాజకీయ శక్తి.. ఇప్పుడు అడుగుపెట్టేందుకు చోటు వెతుక్కోవాల్సిన పరిస్థితికి చేరిందా? పార్టీ జెండా ఉంది.. నేతలు ఉన్నారు.. శ్రేణులు ఉన్నాయి.. కానీ క్షేత్రస్థాయిలో ఆ సందడి ఎక్కడ? ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా నిలబడాల్సిన సమయంలో స్వపక్షంలోనే అసంతృప్తి స్వరాలు ఎందుకు పెరుగుతున్నాయి? నాయకత్వ వ్యూహాలు ఎందుకు ప్రశ్నార్థకమవుతున్నాయి? వైఎస్ రాజశేఖరరెడ్డి కాలంలో కాంగ్రెస్‌కు ఉన్న బలమైన పునాది.. రాష్ట్ర విభజన తర్వాత ఎందుకు కూలిపోయింది? వైఎస్ షర్మిల నాయకత్వంపై పార్టీలో వినిపిస్తున్న విమర్శలు ఎంతవరకు వాస్తవం? ఆమెనే మార్చితే కాంగ్రెస్‌కు కొత్త ఊపిరి వస్తుందన్న వాదనకు ఆధారం ఎంత? లేక అసలు సమస్య నాయకత్వం కంటే లోతైనదా? పాత కాపుల ఆధిపత్యం, కొత్త తరానికి దూరం, ప్రజా సమస్యలపై పరిమిత పోరాటం, ఎన్నికల వేళ మాత్రమే కనిపించే రాజకీయ చురుకుదనం.. ఇవన్నీ కలిసి పార్టీ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తున్నాయి? స్థానిక సంస్థల ఎన్నికల గడప ముందుకొస్తున్న వేళ కాంగ్రెస్ తన ఉనికిని నిరూపించుకోగలదా? లేక గత వైభవం జ్ఞాపకంగానే మిగిలిపోతుందా? గతం ఘనం.. వర్తమానం గందరగోళం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం! అసలు కాంగ్రెస్‌ను అడ్డుకుంటున్నది ప్రత్యర్థులా.. స్వపక్షంలోని సంక్షోభమా?
#AndhraPradeshCongress #APCongress #YSSharmila #Congress #CongressLeadership #APPolitics #AndhraPradeshPolitics #CongressCrisis #CongressRevival #PoliticalStrategy #YSR #LocalBodyElections #CongressParty #AndhraPradeshNews #PoliticalAnalysis











