Home AP సిరినగరిలో సిగపట్లు చైర్మన్ పదవి కోసం నేతల పాట్లు

సిరినగరిలో సిగపట్లు చైర్మన్ పదవి కోసం నేతల పాట్లు

ప్రొద్దుటూరులో ఇప్పుడు అసలు పోరు ప్రత్యర్థి పార్టీల మధ్య కంటే.. సొంతింట్లోనే మొదలైంది! ‘సిరి నగరి’లో ఒక్కటే ఛైర్మన్‌ కుర్చీ.. దాని కోసం టీడీపీలో మాత్రం ఆశావహుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. రిజర్వేషన్‌ ఇంకా తేలకముందే పేర్లు తెరపైకి రావడం.. సామాజిక సమీకరణాలపై లెక్కలు మొదలవడం.. పార్టీ పెద్దల వద్ద ప్రయత్నాలు ఊపందుకోవడం రాజకీయ వేడిని పెంచుతోంది. ఓసీ అయితే ఎవరు? బీసీ అయితే ఎవరు? చేనేతలకు అవకాశం వస్తే పరిస్థితి ఏంటి? మరోవైపు వైసీపీ కూడా తన పాత రాజకీయ బలాన్ని కదిలిస్తోంది. జనసేన, బీజేపీతో కూటమి సమన్వయం కూడా కీలకంగా మారనుంది. ప్రత్యక్ష ఎన్నిక కావడంతో పార్టీ బలంతో పాటు అభ్యర్థి వ్యక్తిగత ఓటు బలం కూడా పరీక్షకు రానుంది. రిజర్వేషన్‌ తేలగానే ఎవరి లెక్క మారుతుంది? టికెట్‌ ఎవరికి దక్కుతుంది? చివరకు ఛైర్మన్‌ కుర్చీ ఎవరిని చేరుతుంది?

 

#Proddatur, #ProddaturPolitics, #TDP, #TDPLeaders, #ChairpersonElection, #LocalBodyElections, #ProddaturMunicipality, #YSRCP, #JanaSena, #BJP, #PoliticalEquations, #Reservation, #BCReservation, #APPolitics, #AndhraPradesh