చీరాల తీర ప్రాంతానికి త్వరలోనే సరికొత్త హంగులు

67
  • వాడరేవు టు మోటుపల్లి ఫోర్ వే లైన్ రోడ్డు ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే మాలకొండయ్య
  • 16 కిలోమీటర్ల మేర రూ.33 కోట్లతో అంచనాలు
  • బీచ్ టూరిజం అభివృద్ధికి సీఎం సానుకూలత

చీరాల, జూన్ 22(నాదేశం) : చీరాల నియోజకవర్గంలో బీచ్ టూరిజం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా తీర ప్రాంత రూపురేఖలను మార్చేలా రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనను చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి అందజేశారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

చీరాల పరిధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వాడరేవు బీచ్ నుండి చారిత్రాత్మక మోటుపల్లి వరకు, రామాపురం మీదుగా దాదాపు 16 కిలోమీటర్ల మేర ఫోర్ వే లైన్ రోడ్డు నిర్మాణానికి రూ.33 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే మాలకొండయ్య, ఈ ప్రాజెక్ట్ అంచనాల నివేదికను ఆయనకు సమర్పించారు.

వాడరేవు-మోటుపల్లి మధ్య ఫోర్ వే రోడ్డు అందుబాటులోకి వస్తే చీరాల తీర ప్రాంతంలో బీచ్ టూరిజం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని కొండయ్య సీఎంకు వివరించారు. పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదనలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నియోజకవర్గంలో పర్యాటక రంగ అభివృద్ధికి, రోడ్లు మౌలిక వసతుల కల్పనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్తూ, ఈ ప్రాజెక్ట్‌పై సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

 

#Chirala #MadduluriMalakondaiah #Malakondaiah #VadarevuBeach #Motupalli #BeachTourism #TourismDevelopment #FourLaneRoad #AndhraPradesh #ChandrababuNaidu #APDevelopment #InfrastructureDevelopment #RoadProject #CoastalTourism #Ramapuram #TourismProject #APPolitics #ChiralaConstituency #DevelopmentWorks #PublicInfrastructure #TouristDestination #BeachRoad #NaDesamNews #BapatlaDistrict #AndhraNews