Home AP అమరావతి రైతులకు భరోసా

అమరావతి రైతులకు భరోసా

ఎకరాలోపు భూములకు యాన్యుటీ.
1304 మంది రైతులకు రూ.5.04 కోట్లు.
పదేళ్లపాటు కొనసాగనున్న చెల్లింపులు.

అమరావతి రాజధాని ప్రాంతంలో ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ కింద ఎకరాలోపు భూములు ఇచ్చిన అర్హులైన రైతులకు వార్షిక యాన్యుటీ చెల్లింపులపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1,304 మంది అర్హులైన భూయజమానులకు ఇప్పటికే చెల్లించిన రూ.5.04 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం తాజాగా రాటిఫై చేసి ధ్రువీకరించింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సెప్టెంబర్‌ 24న జీఓఆర్‌టీ నంబర్‌ 1199ను జారీ చేసింది. 2025 డిసెంబర్‌ 2ను కటాఫ్‌ తేదీగా నిర్ణయించి, ఆ తేదీ నాటికి భూమి విస్తీర్ణం, యాజమాన్యం నిర్ధారణ అయిన వారికి ఈ చెల్లింపులు వర్తిస్తాయి. ఏడు గ్రామాలకు సంబంధించిన అర్హులైన భూయజమానులకు ఈ ప్రయోజనం అందుతుంది. ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ నిబంధనల్లో ప్రభుత్వం చేసిన సవరణల ప్రకారం ఎకరాలోపు భూములు ఇచ్చిన అర్హులైన రైతులకు పొడి భూమికి ఏడాదికి రూ.40 వేలు, జరీబు భూమికి రూ.60 వేల చొప్పున పదేళ్లపాటు యాన్యుటీ చెల్లించనున్నారు. అర్హత నిబంధనలు పూర్తిచేసిన భూయజమానులకు ఈ విధానం వర్తిస్తుంది.

 

#Amaravati #AmaravatiFarmers #LandPoolingScheme #AmaravatiCapital #FarmersAnnuity #AndhraPradesh #APGovernment #LandPooling #CapitalRegion #FarmersBenefits #GO1199 #AmaravatiDevelopment #APNews #FarmersSupport #CapitalFarmers