జనసేనలోకి వైసీపీకి చెందిన పలువురు కీలక నాయకులు చేరారు. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో తుని వైసీపీ నాయకుడు యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ నేత నవీన్ నిశ్చల్ జనసేనలో చేరారు. వారితో పాటు ఏలూరు డీసీసీబీ మాజీ చైర్మన్ పీవీఎల్ఎన్ నరసింహరాజు, కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల వైసీపీ పరిశీలకుడు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు అయితాబత్తుల సుభాషిణి, తునికి చెందిన పొలినాటి శేషగిరిరావు, తణుకు నాయకుడు దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన సత్రవాడ ప్రవీణ్, మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ, నరసరావుపేటకు చెందిన ఏలూరి ప్రసాద్ తదితరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ బలోపేతంపై పవన్ దిశానిర్దేశం
నూతనంగా చేరిన నేతలకు పవన్ కల్యాణ్ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న విధానాలు, సంస్కరణల పట్ల ఆకర్షితులై వైసీపీకి చెందిన నేతలు జనసేనలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తాజా చేరికలతో పలు నియోజకవర్గాల్లో జనసేన సంస్థాగత బలం మరింత విస్తరించేలా పార్టీ నాయకత్వం దృష్టి సారించింది.
#JanaSena #PawanKalyan #YSRCP #YCPLeaders #JanaSenaJoining #PawanKalyanLeadership #YanamalaKrishnudu #NaveenNischal #PVLNNarasimhaRaju #SukumarReddy #AndhraPradesh #APPolitics #JanaSenaParty #PoliticalJoining #JanaSenaNews











