కొత్తపేట మండలం మందపల్లి శ్రీ మందేశ్వర, శనేశ్వర స్వామి దేవస్థాన పరిధిలోని ఉపాలయమైన శ్రీ నాగేశ్వర స్వామివారికి మచిలీపట్నానికి చెందిన భక్తుడు దేవనబోయిన వెంకట నారాయణ భారీ విరాళం అందజేశారు. సుమారు 2.5 కిలోల బరువు, రూ.7.80 లక్షల విలువ కలిగిన వెండి పానుపట్టాన్ని ఆయన గురువారం స్వామివారికి బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, ఈ వెండి పానుపట్టాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి, సహాయ కమిషనర్ దారపురెడ్డి సురేష్ బాబు మరియు ధర్మకర్తల మండలి సభ్యులకు భక్తుడు అధికారికంగా అప్పగించారు.
Home Devotional నాగేశ్వర స్వామికి వెండి పానుపట్టం బహుకరణ – రూ.7.80 లక్షల విలువైన విరాళమిచ్చిన భక్తుడు










