తీర్పు తర్వాత దానం ధీమా.
హైకోర్టు తీర్పుతో ఎమ్మెల్యే పదవి కోల్పోయిన కొద్ది గంటల్లోనే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖైరతాబాద్కు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైతే తాను మళ్లీ పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తీర్పును స్వాగతిస్తున్నానని, ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికలు వస్తే తప్పకుండా బరిలోకి దిగుతానని నాగేందర్ తెలిపారు. ఈసారి కూడా విజయం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న సంకేతాలను ఆయన వ్యాఖ్యలు ఇచ్చాయి.











