శాసనాలేం ఉటంకిస్తున్నాయ్? వాదనలేం చెబుతున్నాయ్?
కులం కోసం చరిత్రను లాగితే… నిజం ఎక్కడ నిలబడుతుంది?
నంద్యాలలో రాయలోరి విగ్రహావిష్కరణతో రచ్చ.
శ్రీకృష్ణదేవరాయలు ఎవరు? ఆయన ఏ వంశానికి చెందినవారు? ఈ ప్రశ్న ఇప్పుడు మరోసారి రాయలసీమ గుండెల్లో రచ్చ రేపుతోంది. నంద్యాలలో రాయల విగ్రహావిష్కరణతో మొదలైన వివాదం.. కుల హక్కుల వాదనల వరకు వెళ్లింది. బలిజ సంఘాలు రాయలు తమ వంశపురుషుడని చెబుతుంటే… యాదవ సంఘాలు తమ వాదనకు పురావస్తు ఆధారాలు ఉన్నాయని అంటున్నాయి. శిలాఫలకంపై ఏ పేరు ఉండాలి అన్న ప్రశ్న… చివరకు చరిత్రను ఎవరు నిర్వచించాలి అన్న పెద్ద ప్రశ్నగా మారింది. అయితే పదహారో శతాబ్దపు విజయనగర చక్రవర్తికి ఇరవై ఒకటో శతాబ్దపు కుల గుర్తింపులను నేరుగా వర్తింపజేయగలమా? తుళువ వంశం ఏం చెబుతోంది? తిరుమల శాసనాలు ఏం వెల్లడిస్తున్నాయి? చంద్రవంశ ప్రస్తావనకు యాదవ వాదనకు సంబంధం ఎంత? ‘నాయక’ అనే బిరుదు ఏం సూచిస్తోంది? ప్రొద్దుటూరులో వెలుగుచూసిన శాసనం ఏం చెబుతోంది? ఒకవైపు వంశాభిమానాలు.. మరోవైపు రాతిలో చెక్కిన చరిత్ర. ఈ రెండింటి మధ్య అసలు నిజం ఎక్కడ నిలబడుతుంది? ఆధారాలు, శాసనాలు, వంశావళులు, సమకాలీన సాహిత్యాన్ని పరిశీలిస్తే తెరపైకి వస్తున్న సమాధానాలు ఏమిటి? రాయల వారసత్వం కోసం జరుగుతున్న ఈ పోరులో.. చరిత్ర గెలుస్తుందా? కుల వాదన గెలుస్తుందా?
#Krishnadevaraya #KrishnadevarayaCaste #TuluvaDynasty #VijayanagaraEmpire #Nandyal #KrishnadevarayaStatue #Balija #Yadava #VijayanagaraHistory #KrishnadevarayaInscriptions #TirumalaInscriptions #ProddaturInscription #RayalaseemaHistory #AndhraHistory #IndianHistory











